![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మోస్ట్ పాపులర్ అయిన కంటెస్టెంట్స్ లలో శోభాశెట్టి ఒకరు. ప్రియాంక జైన్, అమర్ దీప్, శోభాశెట్టి కలిసి టాస్క్ లని గ్రూప్ గా ఆడుతూ సీరియల్ బ్యాచ్ గా బాగా నెగెటివ్ ఇంపాక్ట్ ని తెచ్చుకున్నారు. వీరందరు కలిసి టాస్క్ లలో కామన్ మ్యాన్ రైతుబిడ్డని టార్గెట్ చేస్తూ చేసిన నామినేషన్ లు అన్నీ కూడా ప్రేక్షకులలో వీరిపై ఎక్కువ ప్రభావాన్ని చూపాయి.
శోభాశెట్టిని బిగ్ బాస్ దత్తపుత్రిక అని కూడా అనేవాళ్ళు. ఎందుకంటే తను ఎలిమినేట్ అవ్వాలని చాలామంది ఆడియన్స్ ఓట్లు వేయకుండా తనని లీస్ట్ లో ఉంచిన బిగ్ బాస్ ఎలిమినేషన్ చేయకపోవడంతో తనని కావాలని సేవ్ చేస్తూ వచ్చారని ఆడియన్స్ భావించారు. అయితే పద్నాలుగు వారాలు హౌస్ లో ఉన్న శోభాశెట్టి.. హౌస్ లో ఉన్నన్ని రోజులు అమర్, ప్రియాంకలకి సపోర్ట్ చేసి తన ఆటని మరచిందనే విశ్లేషకులు భావించారు. ప్రతీ కంటెస్టెంట్ మీదకి నోరేసుకొని పడిపోవడం, ప్రతీ చిన్న ఇష్యూకి గొడవపడటం, వామ్మో ఈమెతో నామినేషన్ వద్దురా అనేంతలా చిరాకు తెప్పించిన శోభాశెట్టి. హౌస్ లోకి వెళ్ళాక ఎక్కువగా టేస్టీ తేజతో కలిసి ఉన్న శోభా.. వీరిమధ్య స్నేహాం ఉందని చెప్తూ చేసిన పనులన్నీ చిరాకు తెప్పించేవి. ఇక టేస్టీ తేజ ఎలిమినేషన్ రోజున నువ్వు లేకపోతే నేను హౌస్ లో ఎలా ఉండాలిరా అంటూ ఏడ్చేసింది శోభా. ఇక మోనిత ఎప్పుడు బయటకు వస్తుందా అంటు ట్రోల్స్ చేసేవాళ్ళు రోజు రోజుకి పెరిగిపోవడంతో తనమీదకి ఫుల్ గా నెగెటివ్ ఇంపాక్ట్ వచ్చేసింది.
కొన్నిరోజుల క్రొతం వాళ్ళ అమ్మకోసం ఒక జ్యువలరీ తీసుకుందనే వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా దానికి అత్యధిక వ్యూస్ వచ్చాయి. ఈ కన్నడ భామకి తెలుగులో 'కార్తీక దీపం' సీరియల్ లో మోనిత పాత్ర ఎంత క్రేజ్ తీసుకొచ్చిందో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ' బిగ్ బాస్ తర్వాత అమ్మనాన్నని కలిసాను' అంటూ ఒక వ్లాగ్ ని అప్లోడ్ చేసింది శోభా. ఇందులో వాళ్ళ అమ్మనాన్నలని తనే స్వయంగా వెళ్ళి పికప్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళింది. ఇక హౌస్ లో ఉన్నప్పుడు తను ఎలా ఉందని, నామినేషన్ ప్రక్రియ ఎలా అనిపించిందని అడుగగా.. నామినేషన్ లో నువ్వు అగ్రెసివ్ గా ఉండటం బాగుందని వాళ్ళు పేరెంట్స్ చెప్పారు. ఇక హౌస్ లో శోభా ఉన్నప్పుడు యశ్వంత్ తనని బాగా చూసుకున్నాడని చెప్పగా శోభాశెట్టి మురిసిపోయింది. కాగా యూట్యూబ్ లో ఈ వీడియో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.
![]() |
![]() |